- జిల్లా అధ్యక్షుడు డి నారాయణ
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షులు డి. నారాయణ మాట్లాడుతూ.. 12 కోట్ల మంది మా లంబాడ జాతి ఆరాధించే సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవాలాల్ మహారాజు జయంతిని జరుపు కుంటున్నామన్నారు. పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు ఆరాధ్యదైవాలు అంతా ఒకటిగా ఉన్నటువంటి ఈ జాతి సంస్కృతిని గౌరవాన్ని కాపాడటం కోసం మహారాష్ట్రలో పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని వేలకోట్ల రూపాయల ఖర్చుపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారని రాబోయే తరాలకు వీరి చరిత్ర భావితరాలకు అందించడం కోసం స్ఫూర్తి కేంద్రం కీలకం కాబోతోందని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో బిజెపి పార్లమెంటు సభ్యుల బృందం ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి గజేంద్ర షెఖావత్ ని కలిసి సేవాలాల్ మహారాజ్ జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ జాతి గొప్పతనం గురించి, జాతి సమస్యల గురించి మోడీ కి పూర్తి అవగాహన ఉంది కాబట్టి సేవలాల్ మహారాజ్ జయంతి వచ్చే ఏడాది ఉత్సవాలని దేశవ్యాప్తంగా అధికారికంగా జరుపుతారని ఆశిస్తున్నామని జాతి ఔన్నత్యం కోసం భారతీయ జనతా పార్టీ బంజారాలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి & జిల్లా మీడియా ఇన్ఛార్జి పెద్దిరాజు ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాటముని కృష్ణ గౌడ్ ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పట్టణ ప్రధాన కార్యదర్శి దంతోజు నవీన్ చారి రాయన్న సాగర్ ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ విజయ్ సాగర్ పట్టణ ఉపాధ్యక్షుడు ఉందేకోటి అంజి మండల బిజెపి ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాసులు ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు చాణిక్య విజయ్ యువమోర్చా వనపర్తి మండల అధ్యక్షులు వెంకటేష్ నాయక్ గిరిజన మోర్చా వనపర్తి పట్టణ అధ్యక్షులు శంకర్ నాయక్ లింగేశ్వర్ గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.





