Thursday, March 26, 2026

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సంబరాలు

నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) : ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా, బీజేపీ రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి. ఆధ్వర్యంలో ఈ రోజు గోదావరిఖని చౌరస్తాలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయ మిత్రులు, అభిమానులు పాల్గొని విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్వీట్స్ పంపిణీ చేస్తూ, బాణాసంచా పేల్చి ఆనందోత్సాహంతో వేడుకలు నిర్వహించారు. సందర్భంగా మాట్లాడిన కందుల సంధ్యారాణి. ఉపాధ్యాయ మిత్రులు చూపించిన ఆత్మీయతకు, బీజేపీ అభ్యర్థికి అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. మల్కా కొమురయ్ విజయం ఉపాధ్యాయ సమాజం ఆశయాలకు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు, విద్యా రంగ అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మచ్చ విశ్వాస్, మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, కోడూరు రమేష్, మిట్టపల్లి సతీష్, బిజెపి నాయకులు తోట కుమారస్వామి, తడగొండ నరసయ్య, అందే రాజ్ కుమార్ చారి, పెండ్యం సత్యనారాయణ, మామిడి వీరేశం, బూడిద రమేష్, జనగామ శివరాం, జక్కన్న బాలు, ఆకాష్ గౌడ్, అయితే పవన్, ప్రవీణ్, గంగరాజు, కందుల సంతోష్, కందుల పుష్పలత, పద్మ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News