నేటి సాక్షి,మెట్ పల్లి : పట్టణంలోని హనుమాన్ నగర్ లో సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మరియు మున్సిపల్ చైర్మన్ రానావేని సుజాత లకు మంగళవారం వార్డు ప్రజలు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ…సెల్ టవర్ నిర్మాణం ద్వారా పరిసరాల ఇండ్లలో ఉన్న ప్రజలు రేడియేషన్ ద్వారా అనారోగ్యానికి గురవుతారని వెంటనే టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు ఇల్లెందుల శ్రీనివాస్,గుంటుక గంగాధర్,రాంపెల్లి నాగభూషణం,బొమ్మ కంటి గోపి,గణేష్,రవి,సురేష్,విజయ్, శ్రీరాములు,పరంధాం తదితరులు పాల్గొన్నారు.




