Monday, March 30, 2026

ఆపద సమయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ చెకింగ్ మిషన్ను ప్రారంభించిన సీఈఓ ఎం వి రావు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఆపద సమయంలో బంగారాన్ని బ్యాంకులో పెట్టుకొని త్వరగా డబ్బులు తీసుకునే కస్టమర్ల కోసం సువర్ణ అవకాశాన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తుందని బ్యాంక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ఏంవి రావు అన్నారు. శుక్రవారం వరంగల్ కొత్త వాడలోని సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా బ్యాంకులో నూతన గోల్డ్ లోన్ మిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్యాంకుకు వచ్చే కస్టమర్ల సౌకర్యం కోసం దేశంలో మొదటి సారిగా అది తెలంగాణ లోనీ వరంగల్ లో ప్రధమంగా ప్రారంభించడం జరిగిందని, ఈ అవకాశాన్ని బ్యాంకులో గోల్డ్ పెట్టుకునే కస్టమర్ లు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. బ్యాంకు లో గోల్డ్ లోన్ కోసం వచ్చే కస్టమర్లు వెయిటింగ్ చేయకుండా .. అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వరంగల్ బస్టాండ్ ఏరియాలోని ఎం కె నాయుడు హోటల్లో బ్యాంకు కస్టమర్ల సమావేశం లో ప్రత్యేకంగా పాల్గొని.. వివిధ పథకాలను ఈ సందర్భంగా ఆయన పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ లు వివేక్ కుమార్, ధారా సింగ్ నాయక్, రీజినల్ మేనేజర్ వి. కృష్ణమోహన్, బ్రాంచ్ మేనేజర్ గోపీ నాయక్, మహిళా సంఘాల ప్రతినిధులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News