నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు సమస్త ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తేదీ 25.01.2025 రోజున జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండల స్థాయిలో 23-01-25 రోజున హుజురాబాద్ మండల విద్యా వనరుల కేంద్రంలో విద్యార్థులకు ఉపన్యాస పోటీ మరియు వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్యం మరి ఓటర్ల భాగస్వామ్యం అనే ఉపన్యాస పోటీలో మండల స్థాయిలో పెద్ద పాపయ్య పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి చదువుతున్న ఎలకపెల్లి శ్రీ హర్షిని ప్రథమ స్థానం, వ్యాస రచన పోటీలో బుర్ర తమన్నా ద్వితీయ స్థానం పొందారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సర్టిఫికెట్ ను తీసుకోవడం జరిగింది. ఎలకపెల్లి శ్రీ హర్షిని, బుర్ర తమన్నా, గైడ్ టీచర్ మందల వెంకటరమణ రెడ్డి లను మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, పాఠశాల ఉపాధ్యాయులు పద్మశ్రీ, సుగుణ, బేతి తిరుపతి రెడ్డి, సతీష్ కుమార్, ఇర్రి శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు అభినందించారు.





