- నివేదిక సమర్పించిన టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్
నేటిసాక్షి, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ పై ఏకసభ్య కమిషన్ చైర్మన్ మాజీ జడ్జి షామీమ్ అక్తర్ కు మాల కులస్తులను బీసీలలో చేర్చాలని నివేదిక ఇవ్వడం జరిగింది. అనంతరం టిపిసిసి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములో 59 షెడ్యూల్ కులాలను వారి వారి సంఖ్యను బట్టి రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగ పరంగా అభివృద్ధి చెందిన కులాలను షెడ్యూల్ కులం నుండి తొలగించాలని రాజ్యాంగంలో స్పష్టంగా రాశారు. తెలంగాణ రాష్ట్రంలో మాల కులస్తులు ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, అభివృద్ధి చెందారు. కాబట్టి వారిని షెడ్యూల్ ఎస్సీ కులం నుండి తొలగించి బీసీ కులంలో చేర్చాలని ఎస్సి రిజర్వేషన్ అమలుకై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జడ్జి షమీమ్ అక్తర్ కు ఒక నివేదిక సమర్పించడం జరిగింది. మాల కులస్తులు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ల సంఖ్య తక్కువ ఉన్న కూడా ఉద్యోగపరంగా, ఆర్థికపరంగా, రాజకీయపరంగా, మాదిగలను అణచివేస్తూ మాదిగల హక్కులను అనేక కుట్రలతో దోపిడీ చేస్తున్నారు. మాల కులస్తులు గత ఎన్నో ఏళ్లుగా ప్రతి కమిషన్ కు అడ్డుపడుతూ చివరికి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూన్నారు. ఎస్సీ కులంలో 59 కులాలకు సంబంధించిన ప్రతి చిన్న కులానికి న్యాయం జరగాలని ఎవరి వాట వారికి దక్కాలని అందుకే ఏబిసిడి వర్గీకరణ జరగాలని టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి గా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కదిరే రమేష్, తునికి వసంత్, ఎర్ర ఆదిత్య, అనిల్, జీడి సదానందం తదితరులు పాల్గొన్నారు
ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి….
-తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ గారికి నివేదిక ఇచ్చిన ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్
కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ పై బుధవారం రోజు ఏకసభ్య కమిషన్ చైర్మన్ మాజీ జడ్జి షామీమ్ అక్తర్ కి ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఐఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల రత్నం, మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ సారయ్య ,సీనియర్ దళిత నాయకులు మొలుగూరి కొమరయ్య, ద్రవిడ మహాసభ కన్వీనర్ రామ్ రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమ్మడి రాజయ్య, రొంటల కుమారస్వామి, శనిగరం భాస్కర్, ఇమ్మడి కిరణ్ పాల్గొన్నారు