నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావును శనివారం ఎర్రవెల్లి లోని ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రసాదం అందజేసి నూతన సంవత్సర,సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.





