Wednesday, March 25, 2026

చలో ఢిల్లీ మార్చి 28 న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్

  • రాష్ట్ర అధ్యక్షులు గన్నారపు రమేష్

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హనుమకొండ జిల్లా బాల సముద్రంలో ఏఐటియుసి పార్టీ కార్యాలయంలో శనివారం రోజున బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇట్టి మీటింగ్ కు హనుమకొండ జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జక్క రాజ్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమనికి సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర భిక్షపతి మరియు రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గన్నారపు రమేష్ ఇద్దరు విచ్చేసి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలు అవుతున్నప్పటికీ బోర్డుకు పాలక మండలం నియమించకుండా కాలయాపన చేస్తూ వస్తుంది తక్షణమే గుర్తింపు కార్మిక సంఘాల నుండి సభ్యులతో బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని బోర్డుకు సిబ్బందితో పాటు కనెక్షన్స్ కొరకు స్పెషల్ టీం ను ఏర్పాటు చేయాలని కార్మికులు నష్ట పరిహారం అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆన్లైన్లో సభ్యుల నమోదు సభ్యత్వం పునరాగృతం అనుగుణంగా జాబితాన్ని నివారించాలని పైరవీ కారుల ప్రమేయం లేకుండా చూడాలని ఈ సభ ముఖంగా తెలియజేశారు. మార్చి 28న పార్లమెంటు ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నా 3000 మందితో ఉంటుంది ప్రస్తుతం ఉన్న సంక్షేమ చట్టాలు నిబంధనలకు ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా మార్పులు చేసుకుని నిబంధనలు ఉన్నవి దేశ వ్యాప్తంగా ఒకే పద్ధతిలో ఉండాలని సభ్యులు నమోదు సభ్యులను గుర్తించి కార్డులను సభ్యత రెగ్యులేషన్స్ ప్రమాదం నష్టపోయిన వారికి తో పాటు 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ వలస కార్మికులకు ఒకే రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల్లో పనిచేసే వారికి దేశంలోనే ఎక్కడైనా వర్తించే విధంగా గుర్తింపు కార్డులు ఉండాలని సంక్షేమ బోర్డులు రద్దు చేసే ప్రతిపాదనను ఉప సంహరించు కోవాలని ఇండియా కార్పొరేషన్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మార్చి 28న చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం 2018 సంక్షేమం లేకుండా పాలకవర్గం లేకుండా కార్మిక శాఖ అధికారంతో నడుపుతూ సంక్షేమ బోర్డు నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్ళించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ మద్దెల ఎల్లేష్, హనుమకొండ జిల్లా ఏఐటీయూసీ జిల్లా నాయకులు సహాయ కార్యదర్శి బత్తిని సదానందం, రాసపల్లి కుమార్, మాలో శంకర్ నాయక్ , సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, పూర్ణచందర్, కుడి స్వామి, బుర్ర సంపూర్ణ, అనిత ,సుజాత, కవిత మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News