Wednesday, April 1, 2026

మహిళలు ఆర్థికంగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు ఎంతో తోడ్పాటు ఇచ్చారు

  • మహిళా దినోత్సవం పురస్కరించుకొని చంద్రగిమహిళలు ఆర్థికంగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు ఎంతో తోడ్పాటు ఇచ్చారురి నియోజకవర్గంలోని మహిళలకు కుట్టు మిషన్ లు, ఈ ఆటోలు, వికలాంగులకు సైకిళ్ళు, వినికిడి యంత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి : తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీ పరిధిలో రాస్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు సేవా కార్యక్రమాలు రాస్ సంస్థ ప్రతినిధులు నిర్వహించారు. రాస్ సంస్థ ప్రతినిధులు నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు హాజరయ్యారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గత 44 సం||లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు విదేశీ సంస్థల సహకారంతో రాస్ సంస్థ అమలు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు అభినంద నీయమన్నారు. రాస్ సంస్థ సేవలకు గుర్తింపుగా 4 పర్యాయాలు రాస్ సంస్థ జాతీయ స్థాయిలో అవార్డులు రావడం చాలా సంతోసంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జూట్ బ్యాగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మహిళా సాధికారతకు 2000 సంవత్సరంలో మహిళలకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాస్ సంస్థ మహిళా పొదుపు సంఘాల కార్యక్రమాన్ని నిర్వహిస్తుదనీ మహిళలలో చైతన్యం తీసుకురావడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. అనంతరం ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి, రామచంద్రాపురం, తిరుపతిరూరల్, చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాలం మండలాలలో దాదాపు 10 వేలమంది మహిళలు, రైతులను పొదుపు సంఘాలలో సభ్యులుగా చేర్చి వారిలో పొదుపుతత్వం పెంపొందించి, చేతి పనులలో శిక్షణ అందించి, తద్వారా ఆర్థికంగా ఎదిగి వ్యాపార నిర్వహణకు అవసరమైన పెట్టుబడులు అందించడం జరుగుచున్నది అని ఎమ్మెల్యే గారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాస్ సంస్థ ప్రతినిధులు,మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News