Sunday, March 22, 2026

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే దంపతులు

  • భక్తిశ్రద్ధలతో బంగారు తిరుచ్చి వాహనాన్ని అలంకార మండపానికి మోసిన ఎమ్మెల్యే
  • సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలను సమర్పించడం సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే దంపతులు

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చంద్రగిరి మండలం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం గరుడ సేవ ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన సతీమణి సుధా రెడ్డి హాజరై సాంప్రదాయ బద్ధంగా నిష్ట నియమాలతో స్వామివారికి ఎమ్మెల్యే హోదాలో మొదటిసారిగా స్వామివారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు,అర్చకులు ఎమ్మెల్యే దంపతులను ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులకు స్వామివారి గరుడ సేవ సందర్భంగా ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో ఆశీర్వచనాలతో పాటు, తీర్థ ప్రసాదాలు అందించారు పరమపవిత్రమైన ఈ బ్రహ్మోత్సవాల్లో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పులివర్తి నాని, సతీమణి సుధా రెడ్డి తెలిపారు. భక్తజనుల శ్రద్ధాభక్తులతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. స్వామివారి భక్తి ఘనతను చాటిచెప్పే ఈ ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, టీటీడీ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడంతో గరుడ సేవను వారు సులభంగా వీక్షించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News