- కమ్యూనిటీ మహల్ ను సందర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించిన మత పెద్దలు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల): చంద్రగిరి రెడ్డివారిపల్లి సమీపంలో ఈద్గా వద్ద నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ మహల్ ను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముస్లిం మాత పెద్దలతో కలిసి పరిశీలించారు. కమ్యూనిటీ హాల్ పరిశీలించడానికి వచ్చిన ఆయనకు ముస్లిం మత పెద్దలు ఘన సన్మానం చేశారు. ఈ కమ్యూనిటీ మహల్ ను 1 కోటి 60 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అంతేకాకుండా ఈద్గా స్థలంలో డైనింగ్ హాల్ను ఏర్పాటు చేయాలని మత పెద్దలు ఎమ్మెల్యేలు కోరడంతో తక్షణమే తుడా అధికారంతో మాట్లాడి డైనింగ్ హాల్ కు కావలసిన ప్రతిపాదనను సిద్ధం చేసి త్వరలోనే అమలు పరచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, గౌస్ భాషా, మస్తాన్, ఔరంగజేబు, భాహర్, మన్సూర్ పాల్గొన్నారు అనంతరం, ఎమ్మెల్యే చేసిన సహాయానికి మత పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు.





