Wednesday, April 1, 2026

పాకాల మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎంపీ వర ప్రసాద్

  • సుమారు 4 కోట్ల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎంపీ దగ్గుమళ్ళ వర ప్రసాద్

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, దామల చెరువు పంచాయతీలో యన్.అర్.జి.యస్ నిధులతో ..సుమారు నాలుగు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను శనివారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావుతో కలసి ప్రారంభించారు.ముందుగా దామల చెరువు చేరుకున్న ఎమ్మెల్యేకి, ఎంపీకి మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం దామలచెరువు పంచాయతీలో నిర్వహించిన బహిరంగ సభలో అభివృద్ధి అంటే ఏమిటో తెలియని దామలచెరువు పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల ఆశయాలు నెరవేరుస్తున్నామన్నారు. అంతేకాకుండా పాకాల మండలంలో ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. మామిడి రైతులను దృష్టిలో ఉంచుకొని, మ్యాంగో బోర్డు ని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారి సహకారంతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News