- – నృత్యాలతో ఆకట్టుకున్న విద్యార్థులు
- – ఎస్ఆర్డిజి స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
నేటి సాక్షి, కరీంనగర్: భారత తొలి ప్రధాని దివంగత జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శుక్రవారం కరీంనగర్లోని అశోక్నగర్ఎస్ఆర్డిజి స్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులు, విద్యార్థినులతో కలిసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్స్కూల్స్ జోనల్ ఇన్చార్జి శశిధర్ మాట్లాడుతూ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారతదేశ భావి పౌరులుగా మనం మన దేశానికి ఎంతో సేవ చేయాలని ఆయన అన్నారు. ప్రిన్సిపాల్ మానస మాట్లాడుతూ విద్యార్థులు మానసికంగా సంతోషంగా ఉండటానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నెహ్రూ పుట్టినరోజున బాలల దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతి కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. టీచర్లు పిల్లలకు ఆటల పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్, డ్యాన్స్ తదితర కాంపిటీషన్లు నిర్వహించారు. అనంతరం పలు అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు, ప్రైజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.








