Friday, March 13, 2026

తోటపల్లి గ్రామంలో చెలిమేడా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు

నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో చెలిమేడా ఫీడ్ మరియు సాల్వెంట్ ప్లాంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని జి.ఎం. వీరాంజనేయులు పరిశీలించారు. ఆదివారం జరిగిన టోర్నమెంట్‌లో చెలిమేడా సాల్వెంట్ ప్లాంట్, తోటపల్లి ఆఫీస్, చెలిమేడా ఫీడ్ ప్లాంట్, మరియు కరీంనగర్ హెడ్ ఆఫీస్ క్రీడాకారులు పాల్గొని ఆడారు.ఈ సందర్భంగా జి.ఎం. వీరాంజనేయులు మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ వంటి క్రీడలను ప్రోత్సహించడమే కాకుండా, క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అనిరుద్ రావు, ప్రవీణ్, వరుణ్ రావు, నోముల శ్రీకాంత్, సుమన్, లక్కీరెడ్డి తిరుమలరెడ్డి, పర్శరామ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News