నేటి సాక్షీ, చెన్నూర్ టౌన్ : చెన్నూర్ పట్టణంలో డయేరియా వ్యాప్తి నేపథ్యంలో చెన్నూర్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రోగులను పరామర్శించిన వివరాలను అడిగి తెలుసుకుని రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించి చెన్నూరు మున్సిపాలిటీలో తాగు నీరు సమస్యను పరిష్కరించాలని ఆదేశించి బట్టి గూడెం జెండా వాడలో మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందిస్తున్నాం. బోనాల జాతరతో నీళ్లు కలుషితం అయ్యాయి. ఇక్కడ వాంతులు విరేచనాలతో ప్రజలు బాధ పడుతున్నారు. ఇక్కడ బతుకమ్మ వాగు నుండి కాకుండా గోదావరి నీళ్లు వచ్చేలా చూస్తున్నాము. అమృత్ పథకం తో నీళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మాట్లాడి నిధులు కేటాయించి సమస్య శాశ్వత పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.





