
నేటి సాక్షీ,చెన్నూర్ టౌన్: చెన్నూర్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించనున్న ప్రైమరీ హెల్త్ సెంటర్, అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి హల్ కి శంకుస్థాపన చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోటీ నలభై మూడు లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణంతో పాటు అంబేద్కర్ కమ్యూనిటీ హాలు కు 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ భవనం రానున్న రోజులో నేతకాని భవనానికి సంబంధించి ప్రతిపాదిత స్థలాన్ని స్థానిక అధికారులతో పరిశీలించిన గతంలో నేను ఎంపీగా ఉన్నప్పటి నుండి ఇక్కడ ప్రాంత ప్రజలు నన్ను కోరడం జరిగింది.

అందుకే వారి కోరిక మేరకు అంబేద్కర్ భవనం నిర్మించాలని అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాము. త్వరలోనే ఇక్కడ ప్రాంత ముదిరాజ్ సోదరులు కూడా ముదిరాజ్ భవన నిర్మాణం చేపట్టాలని కోరారు వారికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే ముదిరాజ్ భవనానికి శంకుస్థాపన చేస్తాము. ఆ పనులు కూడా పూర్తి చేస్తాము. ఇప్పటికే చెన్నూర్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి సీసీ రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు అన్నీ పూర్తి చేసుకున్నాము. వచ్చే సంవత్సరంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతాము.





