నేటి సాక్షి తిరుపతి న్యూస్ తిరుపతి రిపోర్టర్ (డాక్టర్ శివ) : తిరుపతి రూరల్ చంద్రగిరి మండలం చెర్లోపల్లి గ్రామానికి సర్పంచ్ అయినటువంటి బొల్లినేని సుభాషిని జాతీయ ఉత్తమ సర్పంచ్ పురస్కారానికి ఎన్నికై ఢిల్లీలో జరిగిన ఉత్తమ సర్పంచ్ వేడుకలో పాల్గొని ఢిల్లీ అధికారులు చేత గౌరవ ఉత్తమ సర్పంచ్ పురస్కారాన్ని అందుకోవటం జరిగింది. ఈ సందర్భంగా చెర్లోపల్లి గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. చెర్లోపల్లి కి 60 అడుగుల రోడ్డు షాపింగ్ కాంప్లెక్స్ తుడా పార్కులు చెర్లోపల్లి గ్రామ ప్రజలందరికీ కుల మత వర్గ బేధాలు లేకుండా చెర్లోపల్లిని కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేశారని చెర్లోపల్లి అభివృద్ధికి సంబంధించి శాశ్వత కీర్తిని చెర్లోపల్లి సర్పంచ్ సుభాషిని సాధించిందని అదేవిధంగా ఆమె భర్త అయినటువంటి శుభగిరి నాయుడు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మా కుటుంబం చెర్లోపల్లి అభివృద్ధికి పేద ప్రజల ఉన్నతికి రాజకీయాలకతీతంగా సహాయ సహకారాలు అందిస్తామని తన సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ దళిత కాపు బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శివ చెర్లోపల్లి సర్పంచి సుభాషిని మరియు శుభగిరి నాయుడు నీ ఘనంగా సన్మానించడం జరిగింది.



