Monday, March 23, 2026

మేధో శక్తికి చెస్ ఓ ఆయుధం

  • చిన్న వయసు నుంచి చదరంగం పై ఆసక్తి పెంచుకోవడం అభినందనీయం
  • టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి: మేదో శక్తికి పదును పెట్టే ఆయుధం చదరంగం అని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక యూత్ హాస్టల్లో తిరుపతి డిస్టిక్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ టోర్నమెంట్-2025 కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులు శివ కేశవులు, శ్రీనివాస్ సూరి ఆహ్వానం మేరకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసు నుంచి ఎంతోమంది విద్యార్థులు తమ మేధో శక్తి కి పదును పెట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణం అన్నారు. క్రీడలు విద్యార్థుల దినచర్యలో భాగం కావాలని పిలుపునిచ్చారు. చెస్ టోర్నమెంట్ లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News