నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చంద్రగిరి మండలం దోర్నకంబాల గ్రామంలో బుధవారం జరిగిన గంగమ్మ జాతీరలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ, కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా నడవీధి గంగమ్మకు హర్షిత్ రెడ్డి అమ్మవారికి సారె సమర్పణ చేయగా గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత అమ్మవారి దర్శనం చేయించారు. ఆ తరువాత గ్రామానికి చేరుకున్న చెవిరెడ్డి లక్ష్మీకి గ్రామస్తులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం పుసుపు, కుంకుమలను ప్రసాదంగా అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.



