Saturday, March 21, 2026

ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు

నేటిసాక్షి /మంగపేట : జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్బంగా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోడెల నరేష్ మాట్లాడుతూ భరతమాత మొగలుల గుప్పిట్లో చిక్కుకుని భారతీయులు విలవిలలాడుతున్న సమయంలో ఓ శక్తి ఈ గడ్డ పై పురుడు పోసుకుంది. ఖడ్గం చేతపూని ప్రళయకాల రుద్రరూపాన్ని ధరించింది. మొఘలుల సామ్రాజ్యాపు పునాధుల్ని బద్ధలు గొట్టింది. దుర్గమమైన మార్గం లో ఓటమన్నదే లేకుండా ఒక్కో దుర్గాన్ని జయిస్తూ మహాసామ్రాజ్యాన్ని స్థాపించి భారతజాతికి ఉపిరిలూది కొత్త జవసత్వాలిచ్చింది. ఆ శక్తి పేరే ఛత్రపతి శివాజీ ఆ కారణ జన్ముడి కి మనం ఎంతో రుణపడి ఉంటామని ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ అన్నారు. ఈ కార్యాక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ ట్రస్ట్ సభ్యులు పందిరి మోహన్ మైల మల్లికార్జున్ మట్టం మహేష్ సీలోజు శ్రీనివాస్ నుతుల కంటి కృష్ణ భూక్య కుమార్, ఆదినారాయణ సతీష్, మహేష్, వెంకటేష్ , రవి శ్రీను పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News