Monday, March 23, 2026

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : కమలాపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున ఆరే సంక్షేమ సంఘం కమలాపూర్ మండల అధ్యక్షులు కదం రాములు అధ్యక్షతన ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కమలాపూర్ ఛత్రపతి శివాజీ విగ్రహం కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపెల్లి శివాజీ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ఆరే కులం ని ఓబిసిలో చేర్పించుటకు పోరాటం చేస్తున్నామని మల్కాజిగిరి MP ఈటెల రాజేందర్ సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో త్వరలోనే సాధిస్తామని మరియు హైదారాబాద్ లో ఆరే కుల భవనం సాధిస్తామని ఆరేకుల సమస్యల పట్ల ఎల్లప్పుడూ పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెండా రాజేశ్వర్ రావు,కమలాపూర్ Ex ZPTC లాండిగే కల్యాణి లక్ష్మణ్ రావు,జిల్లా అధ్యక్షులు శివాజీ, పంగిడిపల్లి ఆరె కుల అధ్యక్షులు బాసుపాటి వీరేశం, EX సర్పంచి ఉపాసి తిరుపతి రావు,EX సర్పంచ్ చేలికే శ్రీనివాస్, మోకిడే వెంకటేశ్వర్లు, గుడెకారి రాజేశ్వర్ రావు, తిప్పారపు యుగేందర్, పుస్కూరి రాంబాబు, వలిగె సాంబరావు, కల్వాల సాంబయ్య, రాజేష్, అముదాపురం రామారావు ఇంకా అన్ని గ్రామాల ఆరే కుల భాంధవులు పెద్ద సంఖ్యలో హజరు అయ్యి ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News