Saturday, March 21, 2026

ఛత్రపతి శివాజీ ఆశయసాధనకు కృషిచేయాలని

  • ఆరె కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోకిలి శ్రీనివాస్

నేటి సాక్షి-హుజురాబాద్ ( రాఘవుల శ్రీనివాసు) : ఛత్రపతి శివాజీ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఆరె కుల సంక్షేమ సంఘం హుజురాబాద్ అధ్యక్షుడు మోకిలి శ్రీనివాస్ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… చత్రపతి శివాజీ నేటి యువతకు స్ఫూర్తి అని, ఆయనను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అంగరిక శంకర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మొకిలి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఉపాస సురేందర్, కోశాధికారి రాజకుమార్, కార్యవర్గ సభ్యులు నరేష్, రాజన్న, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News