Sunday, March 22, 2026

అంతుచిక్కని వ్యాధితో కోళ్ల మృత్యువాత

  • లింగంపేటలో కలకలం
  • బర్ట్‌ఫ్లూగా అనుమానం

నేటి సాక్షి ప్రతినిధి, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో రమేష్ రావు అనే 14 ఏళ్లుగా కోళ్ల ఫారం తో జీవనోపాధి పొందుతున్నాడు. రైతుకు చెందిన కోళ్లు వారం క్రితం ఫామ్‌లో మూడు రోజుల వ్యవధిలో 2500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. వారం రోజుల క్రితం రైతు రమేష్ రావు రోజు మాదిరిగానే కోళ్ల ఫారం కు వెళ్లి చూడగా వందల సంఖ్యలో కోళ్లు మృతి చెంది కనిపించాయి. దీంతో వాటిని ట్రాక్టర్ లో తీసుకెళ్లి గ్రామానికి దూరంగా పడేసినట్లు పేర్కొన్నారు. 35 రోజుల వ్యవధిలో కోళ్లు మొత్తం మృతి చెందడంతో నాలుగు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. మండలంలోని ఇతర గ్రామంలో కూడా కొన్ని కోళ్ల ఫామ్ లో కూడా కోళ్లు మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. భారీ స్థాయిలో కోళ్లు చనిపోతుండడంతో ఇవి బర్డ్ ప్లూ కారణంగా చనిపోతున్నట్లు భావిస్తున్నారు. ఇది ఒక ఆందోళనకరమైన పరిణామం. లింగంపేటలో భారీ స్థాయిలో కోళ్లు మరణించడం స్థానిక రైతులకు ఆర్థికంగా తీవ్రమైన నష్టం కలిగించింది. ఇది బర్డ్ ఫ్లూ లేదా వేరే ఏదైనా వ్యాధి వల్ల జరిగిందా అనే విషయాన్ని స్పష్టంగా నిర్ధారించుకోవడానికి అధికారుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News