Monday, March 23, 2026

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికలపై తప్ప విద్యారంగం పై శ్రద్ధ లేదు

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ విద్య రంగంపై లేదని పిడిఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి శ్రీకాంత్ విమర్శించారు. పిడిఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని మార్క్స్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తామని, మెస్ చార్జీలు పెంచుతానని, మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తామని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తామని చెప్పి, నేడు గద్దెనెక్కిన తర్వాత హామీలను తుంగలో తొక్కి విద్యార్థులను మోసం చేసిన కీర్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్య రంగ సమస్యలను ఎక్కడికి అక్కడే వదిలేయగా, అదే తీరులో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే అమలు చేస్తుందన్నారు. దీంతో విద్యార్థులు ఉన్నత చదువులను చదవలేక మధ్యలోనే మానీ వేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల పైన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఇచ్చిన హామీలను, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలన్నారు. విద్యార్థుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ నేడు విద్యార్థులకు బడ్జెట్ నిధులు కేటాయించడంలో పాలక ప్రభుత్వాలు ఎందుకు చిన్నచూపు చూస్తుందన్నారు. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం స్పందించి, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఆందోళనలు నిర్వహించి, సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ జిల్లా నాయకులు సికిందర్, కార్తీక్, వంశీ, సంతోష్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News