Sunday, March 15, 2026

నారావారి పల్లి పర్యటనలో అర్జీదారునికి 2 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి

  • రాష్ట్ర ముఖ్యమంత్రిని నారావారి పల్లి పర్యటనలో కలిసిన అర్జీదారునికి 2 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించిన
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
  • ఆపన్న హస్తం అందించి మరోసారి మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

నేటి సాక్షి తిరుపతి జిల్లా : చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఉయ్యాల మిట్ట గ్రామం రత్నప్ప తమ కుమారుడు బాలాజీ పుట్టుకతో విభిన్న ప్రతిభావంతుడని వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదని తాము నిరుపేదలమని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారావారిపల్లి పర్యటన సందర్భంగా కలవగా ముఖ్యమంత్రి గారు మా పరిస్థితిని, స్థితిగతులు చూసి చలించి పోయి ఆర్థిక సాయం అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించగా నేడు సదరు అర్జీదారుడు కలెక్టర్ కార్యాలయమునకు రాగా వెను వెంటనే 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి బాలాజీ తండ్రి రత్నప్పకు జిల్లా కలెక్టర్ చెక్కును అందచేశారు. తమకు 2 లక్షలు ఆర్థిక సహాయం చేసి ఆదుకుని ఆపన్న హస్తం అందించిన ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News