నేటిసాక్షి /వాజేడు : చైల్డ్ ఫర్ ఇండియా అనే ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ లిట్రసి సెంటర్ ని వాజేడు మండల కేంద్రంలోని నాగారం ప్రాథమిక పాఠశాలలో మండల విద్యశాఖ అధికారి తేజావత్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం అయనమాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కావలసిన ఆట వస్తువులు, విద్యా బోధనకు అవసరమయ్యే అదనపు పాఠ్యపుస్తకాలను చైల్డ్ ఫర్ ఇండియా ప్రతినిధులు అందించారు. ఓలమ్ ఫుడ్ ఇంగ్రిడియన్స్ వారి సహకారంతో పనిచేసే చైల్డ్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఏజెన్సీ ప్రాంత విద్యార్థుల అభివృద్ధి కోసం సంస్థ రెండు సంవత్సరాల గాను ఉపాధ్యాయులకు సహాయంగా ఒక వాలంటీర్ను నియమించడం చాలా సంతోషం అన్నారు ప్రభుత్వం ఉపాధ్యాయులు వాలంటీర్ సహకారంతో విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి జరుగుతుందని అన్నారు. మండలంలో ఇలాంటి విద్యా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే తన ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంస్థ ఫీల్డ్ ఆఫీసర్ ఎన్ బుచ్చిబాబు, ఉపాధ్యాయులు మనోజ్ శిరీష పాల్గొన్నారు.





