Tuesday, March 31, 2026

వృద్దాశ్రమానికి చిన్నారుల చేయూత

  • రూ. 1లక్ష 17వేల విరాళం అందజేత

నేటిసాక్షి, రాయికల్: హైదరాబాద్ లో ఏర్పాటు చేయతలపెట్టిన వృద్దాశ్రమానికి రాయికల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చిన్నారులు రూ.1లక్ష17వేల328వేల విరాళాలను నిర్వహకులకు సోమవారం అందజేసారు. హైదరాబాద్కు చెందిన ఎస్ఓసిహెచ్ పౌండేషన్నిర్వహకులు ఇటీవల పాఠశాలకు వచ్చి వృద్దాశ్రమం ఏర్పాటు విషయంలో సాయం అర్థించారు. దాంతో విద్యార్థులు, తల్లదండ్రులు తమకు తోచిన సాయం టీచర్లకు అందజేయగా ప్రార్థన సమయంలో సోమవారం నిర్వహకులకు పాఠశాల డైరెక్టర్ తిరుపతిరావు, ప్రిన్సిపల్ వేణుగోపాల్రావు, తల్లిదండ్రుల సమక్షంలో అట్టి విరాళాన్ని అందజేసారు. చిన్నారుల అందించిన సాయంపై పలువురు అభినందనలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News