నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ :
నాగర్ దొడ్డి గ్రామంలో నరసింహులు అనే వ్యక్తి ఆయన సొంత పొలంలో కరెంటు పెద్ద లైను పోలు వైరు తెగిపోవడంతో 5 క్వింటాల మిరప పంట కాలిపోయిందని బాధితుడు వాపోయాడు. విద్యుత్ వైరు తెగిపడి 24 గంటలు గడిచిన అధికారులు స్పందించలేదని బాధితుడు ఆరోపించారు. రాత్రి వేళలో పంటచేనులో ఎవరైనా వ్యక్తులు అక్కడికి పోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు స్పందించి వెంటనే తెగిపడిన వైరును సరిచేసి ప్రాణాల నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.





