నేటిసాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెoగని మనోహర్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షులు మైనాల నరేష్ వర్ధన్నపేట నియోజకవర్గం కి చెందిన నాయకులు చిర్ర సుమన్ గౌడ్ ని వర్ధన్నపేట నియోజక వర్గ ఇన్చార్జి గా నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ అధినేత కేసిఆర్ నాయకత్వం లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షులు మైనాల నరేష్ సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని వెల్లడించారు.




