Tuesday, January 20, 2026

కల్వరి టెంపుల్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ మండలములోని రంగాపూర్ గల కల్వరి టెంపుల్ లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడ ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. చర్చ్ ఫాధర్ రేవ్. డా. పిఆర్ నెల్సన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు క్రీస్తు పుట్టిన రోజు గనుక అధిక సంఖ్యలో క్రైస్తవులు నూతన వస్త్రాలతో ఎంతో సంతోషంగా హాజరయ్యారు. చర్చ్ ని క్రిస్మస్ ట్రీలతో, స్టార్స్ లైట్లతో ఎంతో అందంగా అలంకరించారు. ఈ వేడుకలకు సమాజ సేవకులు, కవి, రచయిత నాగుల సత్యం గౌడ్ మరియు యం ఆర్ పి ఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రాంచందరం మరియు పంచాయతీ సెక్రటరీ బండ ప్రసాద్ మరియు సత్యనారాయణ స్వీట్ హౌస్ యజమాని ప్రతాప నాగరాజు – శాలిని దంపతులు హాజరయ్యారు. మతాలకతీతంగా సత్యంగౌడ్ క్రీస్తు బోధనలు ప్రపంచ మాన వాలికి గొప్ప ఆద్యాత్మిక ప్రవచనాలని , ప్రేమ, శాంతిని బోధించిన క్రీస్తు మనకు ఆదర్శం కావాలని, అందరు సత్ప్రవర్తనతో మేదిలి దేశ శాంతి కోసం పాటు పడాలని తెలియజేసారు. బండ ప్రసాద్ నిరుపేదలకు 10 మందికి చీరలు పంపిణీ చేశారు. ప్రతాప నాగరాజు సంఘ సభ్యులందరికీ స్వీట్స్ అందించారు. చర్చ్ ఫాదర్ నెల్సన్ – సుదిన దంపతులతో పాటు హాజరైన అతిదులందరు కలిసి ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ కేక్ ను కట్ చేసి కేక్స్ తో పాటు స్వీట్స్ అందరికీ పంచి పెట్టారు. ఫాదర్ సందేశం క్రైస్తవులను కంటతడి పెట్టించింది. పిల్లల నాట్యాలు యూత్ స్కిట్స్ తో అందరు సంతోషంగా గడిపారు. క్రైస్తవులతో పాటు కుల మతాలకు అతీతంగా రంగాపూర్, రాంపూర్, రాజపల్లి, హుజురాబాద్ గ్రామాల నుండి చాలా మంది క్రైస్తవులు హాజరయ్యారు. ఈ వేడుకలకు విల్సన్, బొడ్డు సుమన్, హర్ష, కిరన్ తేజ్, బండ చొక్కయ, రమేష్, అనిల్, అశోక్, ఆశీర్వాదం, ధావీదు, పౌలు, విష్ణు, తదితరులు హాజరైనారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News