- వితంతువులకు చీరల పంపిణీ
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు)
హుజురాబాద్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని బిలివర్ చర్చ్ పాస్టర్ నవీన్ ఆధ్వర్యంలో బోరగాల ప్రవీణ్-వాణి దంపతులు వితంతువులకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు సూచించిన శాంతి, ప్రేమ మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలన్నారు. ఆయన ఏర్పరిచిన సత్యమార్గం, నీతి మార్గం అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుమన్ తదితరులు పాల్గొన్నారు.

