- అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ చర్చిలో ఆకట్టుకున్న నాటక ప్రదర్శనలు, నృత్యాలు

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
యేసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ చైర్మన్, ఫౌండర్ ఫాస్టర్ నాగిశెట్టి డానియల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసు క్రీస్తు మార్గనిర్దేశం తెలియజేశారు. ప్రత్యేక సెట్టింగ్లతో యేసు జన్మ వృత్తాంతాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించిన నాటక ప్రదర్శన అబ్బురపరిచింది. చిన్నారులు నూతన దుస్తులు ధరించి ఆడిపాడారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిని సర్వాంగ సుందరంగా అలంకరణలతో తీర్చిదిద్దారు. భక్తులతో చర్చి ఆవరణమంతా కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఫాస్టర్ నాగిశెట్టి డానియల్ బైబిల్ వ్యాఖ్యాలను ప్రసంగిస్తూ… క్రీస్తు పుట్టుకతో లోకానికి వెలుగు వచ్చిందన్నారు. మానవులు చేసిన పాపాలను యేసు క్రీస్తు హరించి పాపాల నుండి విముక్తులను చేస్తారని ఉద్భోధించారు. ఆయన సూచించిన శాంతి, ప్రేమ మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని సూచించారు. యేసు ఏర్పరిచిన సత్యమార్గం, నీతి మార్గం అనుసరణీయమని తెలిపారు

