కరీంనగర్, నేటిసాక్షి: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్రం మంత్రి బండి సంజయ్ కుమార్ ను తన నివాసంలో శుక్రవారం సినిమాటోగ్రాఫర్ మధుసూదన కోట మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సంజయ్ కుమార్ ను శాలువా తో ఘనంగా సత్కరించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా పూడూరు వాస్తవ్యులైన మధుసూదన్ సినిమాటో గ్రాఫర్ గా రాణించడం అభినందనీయమన్నారు. తన ఫోటోగ్రఫీతో సమాజానికి, దేశానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని సూచించారు. సినిమాకు సినిమాటోగ్రఫీ ప్రాణం లాంటిదని, డైరెక్టర్ ఆలోచనలకు , విజన్ కు అనుగుణంగా కెమెరా పనితనం తోడైనప్పుడే సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ఆకట్టుకునీ మెప్పు పొందుతుందని మధుసూదన్ పేర్కొన్నారు. అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేసిన తాను మొదట్లో కొన్ని కమర్షియల్ యాడ్స్ కు సినీ ఫోటోగ్రాఫర్ గా పనిచేయడం జరిగిందన్నారు. మొదటగా సమీరంలో అవకాశం వచ్చిందన్నారు. ఆయన వెంట సీనియర్ ఫోటోగ్రాఫర్ సొల్లు అజయ్ వర్మ పాల్గొన్నారు.



