
నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం, ఉర్లగడ్డ పోడు, కన్నెగుంట గిరిజన కాలనీలో, శివరాత్రి ముందు రోజు, శివరాత్రికి తలకోనకు, కాలినడకన బయలుదేరి, ఏనుగుల గుంపు దాడిలో, మృతి చెందిన, బాధిత కుటుంబాలను గురువారం సాయంత్రం, పరామర్శించిన, సిఐటియు జిల్లా అధ్యక్షులు, సిహెచ్.చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు, బొజ్జ శివయ్య, గిరిజన సంఘ నాయకులు, వెంకటరమణ, చలపతి, వారు మాట్లాడుతూ, కుటుంబ పెద్దలను కోల్పోయి, దుఃఖ సాగరంలో ఉన్నారని తెలిపారు. ముగ్గురు ఏనుగుల దాడులు మృతి చెందారని, వారిలో, గిరిజన కుటుంబాలైన,తిరుపతి చంగల్ రాయుడు, తుపాకుల మణెమ్మ, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి దాతలు ఇచ్చిన సహాయం, ఒక్కొక్కరికి 30వేలు మాత్రమేనని, అందినదని, ప్రభుత్వం, 10 లక్షల ప్రకటిస్తే, ఐదు లక్షల చెక్కు మాత్రమే, ఫారెస్ట్ అధికారులు ద్వారా అందింది అన్నారు, వారి కనీసం 20 లక్షలు అన్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది, ఇక్కడ గ్రామ ప్రజలు, శివరాత్రి ఉత్సవాలకు, తలకోనకు పోవడం అనవాయుతున్నారు, కానీ అక్కడ పోయిన వారిని, మృతుల కుటుంబాలను, ఏరా సంతనం స్మగ్లర్లుగా చిత్రీకరించారని, ఏ ఆధారాలతో వారిని అన్నారో చెప్పాలన్నారు. వారి చేతిలో ఆయుధాలు ఉన్నాయా, ఏమైనా ఎర్ర చందనం మొద్దులు కొట్టినట్లు ఆధారాలు ఉన్నాయా ఏమైనా కేసులు ఉన్నాయా, అని ప్రశ్నించారు. చనిపోయిన వారిలో ఎవరికైనా కేసులు లేవన్నారు. ఫారెస్ట్ అధికారులు, వైపల్యం వలన, ఈ ఘటన జరిగిందని, వారు తప్పించుకునే దానికి, ఇటువంటి సమాచారం, ప్రభుత్వానికి అందించారన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 30 కుటుంబాలు కాలిబాటలో పాల్గొన్నాయని, ఎలా అనుమతించారు, ఫారెస్ట్ అధికారులు, వాచ్ అండ్ గార్డెన్లో, నిద్రపోతున్నారా,ఫారెస్ట్ అధికారులు, భద్రతా చర్యలు ఎందుకు చేపట్టలేదని, ప్రశ్నించారు. బాధ్యులపై చర్య తీసుకోవాలన్నారు. గత 10 సంవత్సరాల క్రితం, అడవికి నిప్పు పెట్టడం వల్ల, కొందరు చనిపోయారని, ఇటువంటి సంఘటన, రెండోసారీ జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో, ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.




