- ఆదరిస్తున్న కార్మిక వర్గం
- యువ కార్మికుల చేరికలతో మరింత బలపడుతున్న సిఐటియు
నేటి సాక్షి, మందమర్రి:-
సింగరేణి కార్మికుల సొంతింటి కల, ఇతర సమస్యల పైన సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఆందోళనలు పోరాటాలతో ఏరియాలో కార్మికుల్లో యూనియన్ కు విశేష ఆదరణ లభించడంతోపాటు యువ కార్మికుల చేరికలతో యూనియన్ కు మరింత బలం చేకూరుతూ, యూనియన్ మరింత బలపడుతుందని యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్ లు తెలిపారు. ఏరియాలోని కేకే 5 గని పై నిర్వహించిన ద్వార సమావేశంలో యూనియన్ గని పిట్ కార్యదర్శి ఆధ్వర్యంలో సూరజ్, నరేందర్ అనే ఇరువురు కార్మికులు యూనియన్ లో చేరగా, వారికి యూనియన్ కండువాలు కప్పి, సాదరంగా యూనియన్ లోకి ఆహ్వానించారు. అనంతరం వెంకటస్వామి, రాజేందర్ లు మాట్లాడుతూ, సిఐటియు గా సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నామని తెలిపారు. స్ట్రక్చరల్ సమావేశాలు టిబిజికేఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరగకపోతే ఎందుకు ప్రశ్నించలేదని ప్రతిపక్షాలను విమర్శిస్తున్న ఏఐటియుసి నాయకులు, గతంలో ప్రాథమిక సంఘంగా ఏఐటీయూసీ గెలిచిన రెండు ఏరియాలో స్ట్రక్చరల్ సమావేశాలు ఎందుకు పెట్టలేదని ఆత్మవిమర్శ చేసుకొని, కార్మికులకు వివరించాలని డిమాండ్ చేశారు. ఏరియాలో జరిగిన స్ట్రక్చరల్ సమావేశాలలో లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ పదోన్నతులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న ప్రమాదాల తీరుపై అధ్యయనం చేసి, భవిష్యత్తులో ప్రమాదం జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఆర్గనైజర్లు ఆదర్శ్, విద్యాసాగర్, గని కార్మికులు పాల్గొన్నారు.





