Thursday, March 26, 2026

ఈ నెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు

  • హనుమకొండ జిల్లాలో 67 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
  • ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఈ నెల 21వ తేదీ నుండి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్నాయని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి తెలిపారు. మార్చి 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయని, పరీక్ష వేళలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయన్నారు. కాంపోజిట్ కోర్స్ పరీక్షల సమయం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు ఉంటుందన్నారు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలకు ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు డీఈవో వెల్లడించారు. పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ తేదీలను, పరీక్ష జరిగే సమయాన్ని తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News