- కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు


నేటి సాక్షి, న్యూస్ ఆళ్లగడ్డ ప్రతినిధి: ఆళ్లగడ్డ మండలంలోని కోట కందుకూరు గ్రామంలో ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎంపీడీవో మహబూబ్ ఖాన్, గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరి గోపాల్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు తడి చెత్త పొడి చెత్త హానికర చెత్తలను వేరువేరు కుండీలలో వెయ్యాలన్నారు. గృహిణిలు ముఖ్యంగా తడి చెత్తను వర్మి కంపోస్టు గా తయారుచేసి ఇంటిలోని మొక్కలు చెట్లకు కంపోస్టుగా వేసుకోవడం ద్వారా ఫల సాయం అందుతుందని అయన సూచించారు.ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు ఈరోజు ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామంలో స్వచ్చ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో అధికారులంతా పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీధులు, డ్రైయిన్లు, ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ వన్లో భాగంగా “సోర్స్ – రిసోర్స్’ థీమ్ను నిర్వహించాలని తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తల సేకరణ, తడి చెత్తతో కంపోస్టు తయారీ, అలాగే వ్యర్థాల వేరు చేయడం ద్వారా సంపద సృష్టి కార్యక్రమాలపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా గ్రామాల నుండి చైతన్యం రావాలని ప్రజలు తమ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం నోడల్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎంపీడీవో మహబూబ్ ఖాన్, గ్రామ నాయకులు ఆర్ల సుబ్బయ్య, సర్పంచ్ నల్లజన లక్ష్మీదేవి, గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





