నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : రాష్ట్ర ముఖ్య మంత్రి రేవతి రెడ్డిని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే SA సంపత్ కుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 3వ తేదీ నుంచి అలంపూర్ పట్టణంలోని శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆయనకు విన్నవించారు. ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు సీఎం ను ఆహ్వానించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఆలయ ఈవో, ఆలయం సభ్యులు ఇతరులు పాల్గొన్నారు.





