- వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పిలుపు
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి నియోజకవర్గంలో మార్చి 2 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల పులిబిడ్డ అభివృద్ధి ప్రదాత ప్రియతమ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు, రాష్ట్రంలో ఎక్కడలేని నిధులు వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం లో దాదాపు 1000 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వస్తున్న వనపర్తి పూర్వపు విద్యార్థి గొప్ప మేధావి నల్లమల్ల ప్రాంతానికి చెందిన వెనుకబడ్డ పాలమూరు టైగర్ రేవంత్ రెడ్డి బహిరంగసభను ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి భారీ ఎత్తున తరలిరావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు, విద్య నేర్చుకున్న ప్రాంతానికి ముఖ్యమంత్రి ఈరోజు మర్చిపోలేకుండా మరపురాని జ్ఞాపకాలతో ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆనాడు వనపర్తి జిల్లా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఇంటర్మీడియట్ విద్యను కూడా వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రథమ ద్వితీయ సంవత్సరం బైపిసి విద్యను నేర్చుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం గర్వకారణం అని అన్నారు,ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 14 నెలల కాలంలో రైతాంగ సమస్యల పట్ల మార్కెట్ యార్లను బలోపేతం చేస్తూ రైతులకు గిట్టు పడతారు తో పాటు సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ చెల్లించి రైతులను ఆదుకున్న ఘనత ఆయనకు దక్కిందని అన్నారు, అంతేకాక 2 లక్షల రూపాయల పంట రుణమాఫీని 21 వేల కోట్లతో మాఫీ చేసి మరోసారి చరిత్ర సూచించారని అదే కాకుండా రైతు భరోసా పథకం కింద రైతులకు దశలవారీగా నిధులు విడుదల చేస్తున్నాడని అన్నారు, ఈ రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల మేరకు దశవారీగా పథకాలు అమలు చేస్తున్నాడని ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించాలని గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి పోయిందని అన్నారు, ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు, అంతేకాక ఆయన ఇక్కడ చదువుకున్న పూర్వపు విద్యార్థులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కూడా ఉంటుందని చదువుకున్నప్పుడు అద్దెకిరాయిలో నివాసం ఉంటున్న వల్లభ నగర్ ప్రాంతంలోని పార్వతమ్మ ఇంటి యజమానిని కూడా కలుస్తున్నాడని ఆయన పేర్కొన్నారు, ఎప్పటికీ కూడా మరచిపోని జ్ఞాపకాలు గుర్తుపెట్టుకున్న ముఖ్యమంత్రి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఏ రోజు కూడా వస్తాడో లేదో అనే విషయం ప్రజలు ఇప్పటికే చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు,




