నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ (కోక్కుల వంశీ):
తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 25 నుంచి 27 వరకు ఎంతో వైభవోపేతంగా నిర్వహించే మహా శివరాత్రి జాతర వేడుకలకు రావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యే లకు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు మహాశివరాత్రి ఆహ్వాన పత్రికను మంగళవారం అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాజన్న ప్రసాదం అందజేసి వేదో ఆశీర్వచనం అందజేశారు.





