Thursday, March 12, 2026

సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

  • సిఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్నారై

నేటి సాక్షి, ప్రతినిధి, వేములవాడ :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. సింగపూర్ లోని ఒక ప్రముఖ హోటల్ లో వేములవాడ నియోజకవర్గంలోని తండ్రియాల గ్రామానికి చెందిన పానుగంటి లక్పతి (ఎన్ఆర్ఐ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పానుగంటి లక్పతి మాట్లాడుతూ.. గల్ఫ్ బోర్డు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమని అన్నారు. గల్ఫ్ బోర్డు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రి శ్రీధర్ బాబుకి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News