Sunday, March 15, 2026

సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

  • పైలట్ ప్రాజెక్టు దేశరాజ్ పల్లి గ్రామం ఎంపిక
  • నాలుగు పథకాల కార్యక్రమంలో లబ్ధి చేకూరిందని కృతజ్ఞతలు

నేటి సాక్షి,కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : కమలాపూర్ మండలం దేశరాజు పల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామంలో లబ్ధిదారులందరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ అయిన సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు చిత్రపటానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు మహిళలు కృతజ్ఞతలతో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఝాన్సీ రాణి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఒడితల ప్రణవ్ బాబుకు గ్రామస్తులందరూ రుణపడి ఉండాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచిగా, ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని దేశరాజుపల్లి గ్రామస్తులను కోరారు. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ సముద్రాల కృష్ణ,మాజీ ఉపసర్పంచి మిట్టపల్లి సుభాష్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు సముద్రాల రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సముద్రాల ఇస్తారి, సముద్రాల ప్రభాకర్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు సముద్రాల రమేష్, సముద్రాల శ్రీనివాస్, అంబాల సమ్మయ్య, సురావ సదయ్య,మాజీ వార్డ్ మెంబర్స్ సత్యం వెంకటేష్, భార్గవ్, ఇసంపల్లి శంకర్, ఎల్లబోయిన శ్రీనివాస్, నాగుర్ల రామయ్య, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News