Friday, March 20, 2026

నిరుద్యోగ యువతకు బాసటగా కూటమి ప్రభుత్వం

  • సిడాప్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి
  • క్యూ. ఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం
  • చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

నేటి సాక్షి తిరుపతి జిల్లా, (బాదూరు బాల) : చిత్తూరు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువతకు బాసటగా నిలుస్తోందన్నారు. దేశంలోని అతి పెద్ద నైపుణ్య శిక్షణ సంస్థగా పేరొందిన “సీడాప్” అనే సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగుతుందన్నారు. ఉపాధి, మార్కెట్ ఆధారిత నైపుణ్య కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రతి పేద గ్రామీణ కుటుంబానికి వ్యవస్థీకృత రంగంలో ఉపాధి అవకాశాన్ని కల్పించాలన్నదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. ఈ నేపథ్యంలోనే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్( సీడాప్) సంస్థలో 18 నుంచి 35 ఏండ్ల వయసు కలిగిన నిరుద్యోగ యువత ఉపాధి కోసం క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉపాధి పొందేందుకు అవకాశం కల్పించారని ఆయన పేర్కొన్నారు. ఈ సదా అవకాశాన్ని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News