Tuesday, March 17, 2026

పైసలు కొట్టు… ఏ పనైనా పట్టు…

  • కమలాపూర్ ఎమ్మార్వో ఆఫీసులో ఆగని లంచాల దందా
  • ఇష్టానుసారంగా మామూళ్లకు అలవాటుపడ్డ ఆఫీసర్లు
  • నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు
  • వాపోతున్న శ్రీరాములపల్లి గ్రామస్తులు

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల): కమలాపూర్ రెవెన్యూ కార్యాలయంలో లంచాల దందా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఓ గ్రామ రైతు దగ్గర లంచం తీసుకుని ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో మాధవి ఘటన అవినీతి మరకలు ఇంకా పోకముందే మామూళ్లకు అలవాటు పడ్డ ఆఫీసర్లు సామాన్య మధ్యతరగతి జనం వద్ద డబ్బులు వసూలు చేస్తూ పనులు చేస్తున్నరు. చిన్న పనైనా, పెద్ద ఫైల్ అయిన “పైసలు కొట్టు ఏ పనైనా పట్టు” అని సిద్ధాంతంతో రెవెన్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. కొంచెం పలుకుబడి ఉన్న మనిషి వస్తే బేరం కుదుర్చుకొని నిమిషాల్లో పని చేసి పెడతారు.అలాగే పైసలు అందని ఫైలు మాత్రం నెలలైనా ముందుకు జరగదు. ఇది కమలాపూర్ రెవెన్యూ ఆఫీసులో జరిగే దందా ఇది.

ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో 6,7,8 వార్డుల్లో 40 కుటుంబాలు గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాయి. వీరంతా కొద్ది సంవత్సరాల క్రితం భూములు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. అయితే వీరికి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోగా దీన్ని ఆసరా చేసుకున్నావు మాజీ ప్రజాప్రతినిది కమలాపూర్ ఎమ్మార్వో ఆఫీస్ లోని ఆఫీసర్లతో మూలాఖత్ ఐ నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల స్థలాల భూమిని పట్టా చేసుకొని పాస్ బుక్ సంపాదించాడు. అసలు వాస్తవంగా ఇళ్ల స్థలాల భూమిని గాని,గ్రామ కంఠంలో ఉన్న భూములను గాని రెవెన్యూ ఆఫీసర్లు రిజిస్ట్రేషన్ చేయకూడదు.కానీ ఆఫీసర్లు అవన్నీ మర్చిపోయి అప్పనంగా మూడు సర్వే నంబర్లలో రెండు ఎకరాల ఆరు గుంటల భూమిని ఆ మాజీ సర్పంచ్ కు పట్టా పాస్బుక్కు రూపంలో జారీ చేశారు. ఈ విషయం కాస్త స్థానిక కాలనీవాసులకు తెలియడంతో ఇదేంటని కమలాపూర్ తాసిల్దార్ కి వెళ్లి ప్రశ్నించారు. నిర్లక్ష్యపు సమాధానం చెప్పిన వారు మాకేం తెలియదు అంటూ భూకాయించారుచారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కాలనీవాసులు కొందరు ఇన్ఫర్మేషన్ లాగి సంబంధిత అధికారి, మాజీ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.ఇండ్ల స్థలాల భూమికి పట్టా పాస్ బుక్ ఎట్లా జారీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు వెంటనే రెవెన్యూ ఆఫీసర్ పై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని, పట్టా పాస్ బుక్ జారిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కాలనీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మా భూములు మాకు ఇవ్వాలంటూ నినాదాలు చేసినవారు కలెక్టర్ కు, సీపీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇట్లాంటి సంఘటన మరెక్కడ జరిగినప్పటికీ కమలాపూర్ జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సి ఉండగా బాధితులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఫీసర్ల తీరును తప్పుపడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News