
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జిల్లా గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి శనివారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు లోని ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేసి, ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాం లకు సంబంధించిన రికార్డులు, కట్టు దిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించిన వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో తహసీల్దార్ ఇక్బాల్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, మార్కెట్ కార్యదర్శి నిర్మల తదితరులు పాల్గొన్నారు.





