Thursday, March 26, 2026

సహకార సంఘం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి పలు రిజిస్టర్ లను పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ పాస్ ద్వార మాత్రమే రైతులకు అమ్మకాలు జరపాలని సూచించారు. ఒక రైతుకు ఎన్ని యూరియా బస్తాలు ఇస్తున్నారు అని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రైవేట్ ఫర్టిలైజర్స్ ద్వారా ఎలా అమ్మకాలు జరుపుతున్నారు అని వివరాలు తెలుసుకున్నారు.యూరియా బస్తాలు ఎమ్మార్పీ ధరలకు మాత్రమే అమ్మకాలు జరపాలని అధికారులకు తెలిపారు.స్టాక్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకొవాలని, పాస్ మిషన్ ద్వారా మాత్రమే అమ్మకాలు చేయాలని సూచించారు.పట్టా పాస్ బుక్ ద్వారా ఎకరాల చొప్పున యూరియా అమ్మకాలు చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్ఒ, డిపిఓ మధన్ మోహన్,ఎంపీడీవో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News