Thursday, March 19, 2026

డిజటల్ ఏరియల్ భూ సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

  • హెలికాప్టర్ ద్వారా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి లో భూసర్వే
  • కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ రికార్డ్స్ నుండి కొనసాగుతున్న సర్వే
  • సెయింట్ గ్యాబ్రియల్ మైదానం లో పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :
హెలికాప్టర్ ద్వారా నిర్వహిస్తున్న డిజిటల్ ఏరియల్ భూ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ డా.. సత్య శారద ఖాజీపేట లోని సెయింట్ గ్యాబ్రి యల్ మైదానంలో సోమవారం క్షేత్ర స్థాయి లో పరిశీలించి సర్వే నిర్వహణ తీరును సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ రికార్డ్స్ ద్వారా ‘నక్ష’ పథకంలో ప్రణాళికలు లేని పట్టణాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సర్వే నిర్వహించడం జరుగుతున్నదని, వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధన్నపేట మున్సిపాలిటి పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా ఎంపిక చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించి ఏరియల్ ఫోటోగ్రఫీ టెక్నాలజీ (2-డి) ను వినియోగిస్తూ సర్వే కొనసాగిస్తారని దీనివల్ల పట్టణ (అర్బన్) ప్రాంతాలలో ఉన్న నిర్మాణాలను, చెరువులు, కాల్వలు, రోడ్లు, హై టెన్షన్ విద్యుత్ వైర్లు నమోదు (క్యాప్చర్) చేసి ఆ ఆకాంక్షలు, రేఖాంశాలను నమోదు జరుగుతుందని, దీని వల్ల భూమికి సంబంధించిన నిజమైన యజ మానులు ఎవరో గుర్తించడం సులభ మవుతుందని టైటిల్ యజమానులు (హక్కుదారులు) ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ తీరును గుర్తించ వచ్చునని మున్సిపాలిటీల్లో ప్రాథమిక సమాచార సేకరణ లక్ష్యం (థీమ్)గా కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ రికార్డ్స్ నుండి ఈ సర్వే కొనసాగుతుందని వర్దన్నపేట మున్సిపాలిటీ మొత్తం ఏరియా 41 కి.మీ ఉందని నేటి (మంగళవారం) లోగా సర్వే పూర్తి చేస్తారని వారం రోజుల తర్వాత వీటికి సంబంధించిన చిత్రాలను (ఇమేజెస్) అందజేస్తారని, తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయడం జరుగు తుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం హెలికాప్టర్ లో అమర్చిన సర్వే సంబంధిత పరికరాలు వాటి పనితీరును గురించి కలెక్టర్ సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News