Monday, December 23, 2024

స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు కొరకు కమీషనర్ కు విన్నపము

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
కరీంనగర్ వరంగల్ రోడ్డును ఆనుకుని ఉన్న హుజురాబాద్ పట్టణ ప్రాంతంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డు వద్ద స్వీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసి ప్రమాదాల బారినుండి ప్రజలను కాపాడాలని పివి సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక మునిసిపల్ కమీషనర్ సమ్మయ్య గారికి వినతి పత్రాన్ని అందించారు. జనాభా పెరుగుదల, గతంలో కన్నా ప్రజల అవసరాల దృష్ట్యా రోడ్డుపై కి వచ్చి వెళ్ళే సందర్భంలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అవసరమని కమీషనర్ సమ్మయ్య ప్రజలకి సూచించారు. వినతిపత్రాన్ని పరిగణలోకి తీసుకుని తక్షణమే ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. జాతీయ రహాదారికి పట్టణము రెండు వైపులా విస్తరించి ఉన్నందున జనాబారద్దీ ప్రాంతాలల్లో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాట్లు చేయాలని,తరచు ప్రమాదాలు జరిగే ప్రాంతాలని గుర్తించాలని,.ఇటీవల ప్రభుత్వ ఉద్యోగి కారు తో ప్రమాదానికి గురై మరణించాడని, అధికారులు వెంటనే స్పందించి రహాదారిపై స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసి ప్రమాధాలని నివారించాలని సిద్ధార్థ నగర్ కాలని అధ్యక్షులు సాగి వీరభద్రారావు, పివి సేవాసమితి అధ్యక్షులు తూము వెంకట రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి బి. సంపత్ రెడ్డి, బి. మనోజ్, కాసర్ల శ్రీహరి,రావుల తిరుపతి రెడ్డి, పసులస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News