Thursday, March 19, 2026

నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

  • డిఎస్పి మొగులయ్య

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల్ నియోజకవర్గంలో నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు డి.ఎస్.పి మొగులయ్య అన్నారు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సోమవారం ఎర్రవల్లి మండల పరిధిలోని కొండేరు గ్రామం లో డీఎస్పీ మొగులయ్య పర్యవేక్షణలో అల్లంపూర్ సిఐ రవిబాబు ఆధ్వర్యంలో అస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు,నాలుగు పార్టీలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించి ముందు వ్యక్తిగత వివరాలు సేకరించి, వారిని ఫేస్ రికగ్నేషన్స్ సిస్టం వారి వేలిముద్ర వారిపై గతంలో ఏదైనా నేరాలు ఉన్నాయనే విషయాన్ని చెక్ చేసి సుమారు 200 ఇళ్లను సోదాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు 10 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నిర్మూలన ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందన్నారు, ఎవరైనా చట్టపరమైన వ్యతిరేకమైన కార్యాపాలకు పలు పడితే పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు, గ్రామంలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసు లేదా డయల్ 100 కి ఫోన్ చేసి న వెంటనే చర్యలు చేపడతామన్నారు తనకు నిర్వహించడం వల్ల నేరాల పట్ల రేట్లు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు, ఈరోజు స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు చూయించి తమ వాహనాలు తిరిగి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు,ఈ కార్యక్రమంలో అల్లంపూర్ సిఐ రవిబాబు, ఇటిక్యాల ఎస్ఐ వెంకటేష్, కోదండపూర్ ఎస్ఐ స్వాతి, అల్లంపూర్ ఎస్ ఐ వెంకటస్వామి,50 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News