- ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం
- ప్రజల రక్షణ మరియు ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ భద్రతాభావం కలిగించడం గురించి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
- పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం చేర్యాల పట్టణం పెద్దమ్మ గడ్డ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేర్యాల సిఐ శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
- నార్కటిక్స్ డాగ్స్ అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది :
నేటి సాక్షి, చేర్యాల : చేర్యాల పట్టణం పెద్దమ్మ గడ్డ కాలనీలో చేర్యాల సిఐ శ్రీను ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు రక్షణ పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి చేర్యాల సిఐ శ్రీను మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజలకు భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని, పట్టణాలలో కాలనీలో గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరియు సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మహిళల రక్షణకు చట్టాలు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. నూతన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎలాంటి పేపర్లు లేని మోటార్ సైకిల్స్-(52), స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన పత్రాలు చూపించి తీసుకొని వెళ్లవచ్చని సూచించారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు,ఎలాంటి పత్రాలు లేని వాహనాలు నడపవద్దని నడిపేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపినారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ఈ మధ్యకాలంలో హెల్మెట్ లేక కొందరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని హెల్మెట్ భారంగా కాకుండా బాధ్యతగా భావించి ధరించాలని సూచించారు. గ్రామంలోఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ తిరుగుతున్న మరియు గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి, గుట్కాలు అమ్ముతున్నా కలిగి ఉన్న వారి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపాలని లేద డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతోమంది తమ విలువైన డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే బ్యాంకు సంబంధించిన వివరాలు, ఓటిపి తదితర నెంబర్లు ఎవరికీ తెలియపరచ కూడదు వాట్స్అప్ లలో అనుమానాస్పదంగా వచ్చే బ్లూ కలర్ మెసేజ్లను క్లిక్ చేయకూడదు సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక గొప్ప ఆయుధం. టోల్ ఫ్రీ నెంబర్లు 1930 డయల్ 100, కాల్ చేయండి తదితర అంశాల గురించి గ్రామస్తులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఎస్ఐ నిరేష్, కొమురవెల్లి ఎస్ఐ రాజు, మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్, ప్రొబిషనరీ ఎస్ఐ మానస రెడ్డి, చేర్యాల సర్కిల్ పోలీస్ సిబ్బంది, డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.





